బన్నీ పక్కన హీరోయిన్ గా కేతిక శర్మ  

Allu Arjun Romance Next With Ketika Sharma-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేస్తుంది.

Allu Arjun Romance Next With Ketika Sharma-

ప్రస్తుతం ఈ చిత్ర హీరో బన్నీ హాలిడే ట్రిప్ లో ఉండడం తో ఈ చిత్రానికి ప్రస్తుతం బ్రేక్ పడింది.దీనితో హాలిడే నుంచి బన్నీతిరిగి రాగానే ఈ చిత్ర రెండో షెడ్యూల్ మొదలవుతుంది.

ఈ చిత్రంలో బన్నీ పక్కన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే వారిలో ఒకరు పూజా హెగ్డే కాగా మరొక హీరోయిన్ ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు.

అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా కేతిక శర్మ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కేతిక పూరి కుమారుడు ఆకాష్ తో ‘రొమాంటిక్’ సినిమా లో కధానాయిక గా నటిస్తోంది.

అయితే ఈ చిత్రంలో ఆమె రోల్ ఏంటి అన్న దానిపై ఇంకా ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆమె సెకండ్ హీరోయిన్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.హారికా హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

.

తాజా వార్తలు

Allu Arjun Romance Next With Ketika Sharma- Related....