స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని తన తాజా చిత్రం ‘పుష్ప’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అది అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది.ఇక ఈ సినిమా టైటిల్‌కు చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం భారీ రెస్పాన్స్ వచ్చింది.
బన్నీ లాంటి స్టార్ హీరోకు లేడీ ఓరియెంటెడ్ టైటిల్ ఏమిటని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఈ సినిమా టైటిల్ పుష్ప అని బన్నీ గతంలోనే రివీల్ చేసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
సుకుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని బన్నీ చేసిన ఓ ట్వీట్లో పుష్ప టైటిల్‌కు సంబంధించి ఓ హింట్ ఇచ్చాడు.సుక్కుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఓ మెసేజ్ పెట్టిన బన్నీ, అందులో పుష్ప అనే పదం వచ్చేలా తన క్రియేటివిటీని చూపించాడు.
ఈ ట్వీట్‌ను అప్పుడు పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ను చూసి ఇలాంటి విషయాన్ని ఎలా గమనించలేదా అని అనుకుంటున్నారు.
మొత్తానికి పుష్ప టైటిల్‌ను బన్నీ రివీల్ చేసినా కనిపెట్టలేని ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం ఈ టైటిల్‌ను వైరల్ చేస్తున్నారు.
ఇక సుకుమార్ డైరెక్షన్లో రానున్న ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.