మీరు ఎంత ఇచ్చినా నేను ఆ యాడ్స్ చెయ్యను.. భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన పుష్ప రాజ్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

 Allu Arjun Rejected Rs10 Cr Offer Gutka And Liquor Brand, Allu Arjun , Tollywood-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ క్రేజ్ ని మరింత పెంచేసింది.కాగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పలు రకాల యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా యాడ్స్ లో నటించడం కోసం తన లుక్స్ ని కూడా మార్చుకుంటున్నాడు అల్లు అర్జున్.ఇకపోతే అల్లు అర్జున్ మామూలుగా ఒక్కొక్క యాడ్ కు రూ.7.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అని సమాచారం.అయితే తాజాగా ఒక కంపెనీ తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయాలి అంటూ అల్లు అర్జున్ ని సంప్రదించిందట.

అయితే అందుకోసం ఏకంగా 10 కోట్ల పారితోషికాన్ని కూడా ఇస్తామని ఆఫర్ చేసిందట.

కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ యాడ్ ని చేసే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పేసాడట.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.అల్లు అర్జున్ నో చెప్పడానికి కారణం అది గుట్కా అలాగే లిక్కర్ కంపెనీ కావడం.జనాలకు హాని చేసే అలవాటును ప్రోత్సహించే ఉద్దేశం లేదు అంటూ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట బన్నీ.

ఈ విషయం కాస్త తెగ వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అలాగే బన్నీ జనాల క్షేమాన్ని కోరుకుంటూ ఉండడంతో అతని మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Telugu Allu Arjun, Gutka Liquor, Puspa, Tollywood-Movie

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను బన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పటివరకు పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు.కానీ పుష్ప పార్ట్ 2 పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ప్రేక్షకులు అభిమానులు అంచనాలను దృష్టిలో పెట్టుకొని కూడా పుష్ప పార్ట్ 2 అంతకుమించి ఉండే విధంగా చూసుకుంటున్నారు.

అయితే పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పడుతుందట.ఈ విషయం పట్ల అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తీవ్రంగా చెందుతున్నారు.

అల్లు అర్జున్ నుంచి పార్ట్ టు సినిమా వీలైనంత త్వరగా ఆశించిన ప్రేక్షకులకు ఈ సినిమా షూటింగే మొదలు కాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube