నెగిటివ్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన బన్నీ...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా రోజూ దాదాపుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.

 Tollywood Stylish Star Allu Arjun Got Corona Negative After 15 Days-TeluguStop.com

దీంతో ప్రభుత్వ యంత్రాంగం కరోనా వైరస్ ని అరికట్టేందుకు సన్నాహాలు చేస్తున్నప్పటికీ నియంత్రణలోకి మాత్రం రావడం లేదు.అయితే తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వైద్య చికిత్సలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు.

అయితే ఇటీవలే మరోమారు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో నెగిటివ్ వచ్చినట్లు అల్లు అర్జున్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపాడు.ఇందులో భాగంగా ఈ విషయానికి సంబందించిన పోస్ట్ ని షేర్ చేస్తూ కరోనా వైరస్ సోకిన 15 రోజుల తర్వాత తనకి నెగిటివ్ వచ్చిందని అలాగే తను కరోనా వైరస్ నుంచి కోలుకోవాలని ప్రార్థనలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

 Tollywood Stylish Star Allu Arjun Got Corona Negative After 15 Days-నెగిటివ్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన బన్నీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈ కరోనా  క్లిష్టపరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతాయని తాను ఆశిస్తున్నట్లు, అలాగే ప్రతి ఒక్కరూ ఇంటిపట్టునే ఉండాలని కూడా తన అభిమానులకు సూచించాడు.దీంతో తమ అభిమాన నటుడికి కరోనా వైరస్ నెగిటివ్ రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కొంతమేర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగు లో “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు లెక్కల మాస్టారు “సుకుమార్” దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ “మైత్రి మూవీ మేకర్స్” నిర్మిస్తోంది.

కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా కన్నడ బ్యూటీ “రష్మిక మందన” నటిస్తుండగా విలన్ పాత్రలో ఫహద్ ఫైజల్ నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కేరళ పరిసర ప్రాంతంలో జరగాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా కొంత కాలంపాటు తాత్కాలికంగా నిలిపి వేశారు.

#AlluArjun #Sukumar #Allu Arjun #PushpaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు