'పుష్ప' టీజర్ వచ్చే డేట్‌ కన్ఫర్మ్‌, ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలు పెట్టేసుకోండి

గత ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్‌ అల వైకుంఠ పురంలో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుని ఇండస్ట్రీగా నిలిచింది.

 Allu Arjun Rashmika Mandana Sukumar Movie Pushpa Teaser Release Date-TeluguStop.com

ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న బన్నీ వెంటనే ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు సిద్దం అయ్యాడు.అదే పుష్ప.

కరోనా కారణంగా పుష్ప సినిమా ఏడాది కాలం పాటు ఆలస్యం అయ్యింది.ఇటీవలే ప్రారంభం అయ్యి చకచక షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా ను ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

 Allu Arjun Rashmika Mandana Sukumar Movie Pushpa Teaser Release Date-పుష్ప’ టీజర్ వచ్చే డేట్‌ కన్ఫర్మ్‌, ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలు పెట్టేసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా నుండి బన్నీ లుక్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.మాసీ లుక్‌ లో బన్నీ కనిపించబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా టీజర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

బన్నీ మరియు రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు వచ్చే నెలలో రాబోతుంది.

ఆ సందర్బంగా పుష్ప టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ ప్లాన్‌ చేస్తున్నాడు.టీజర్‌ లేదా గ్లిమ్స్‌ అయినా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

హీరోయిన్‌ రష్మిక మందన్న లుక్ ఇప్పటి వరకు రివీల్ కాలేదు.టీజర్ లో ఆమె లుక్‌ ను రివీల్‌ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ముగించే అవకాశం ఉంది.ఇటీవలే తమిళ నాడు షెడ్యూల్‌ ను పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

జానీ మాస్టర్ ఆధ్వర్యంలో రష్మికతో కలిసి బన్నీ డాన్స్ చేశాడు.ఆ పాట చాలా బాగా వచ్చిందటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

త్వరలో కొత్త షెడ్యూల్‌ ను మొదలు పెట్టే అవకాశం ఉంది.

Telugu Allu Arjun, Allu Arjun Birthday, Bunny Birthday Pushpa, Bunny Look, Pushpa Movie, Pushpa Movie Teaser Date, Pushpa Update, Rashmika, Sukumar-Movie.

#Pushpa Update #Bunny Look #Sukumar #BunnyBirthday #Rashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు