మళ్లీ సీతమ్మగా నయనతార, అరుదైన రికార్డ్‌  

Nayanatara As Seetha In Allu Aravind 3d Ramayana-

అల్లు అరవింద్‌ మరియు మరో ఇద్దరు బాలీవుడ్‌ నిర్మాతలు కలిసి 1500 కోట్ల బడ్జెట్‌తో మూడు పార్ట్‌లలో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే.బాలీవుడ్‌ స్టార్‌ దర్శకులు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించి దేశంలోని అన్ని భాషల్లో కూడా డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు...

Nayanatara As Seetha In Allu Aravind 3d Ramayana--Nayanatara As Seetha In Allu Aravind 3D Ramayana-

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడి పాత్ర కోసం ఎవరిని తీసుకోబోతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.కాని ఈ చిత్రంలో సీత పాత్ర కోసం మాత్రం నయనతారతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.మూడు పార్ట్‌లకు గాను ఆమె నుండి దాదాపు 200 రోజుల పాటు డేట్లు అడిగారట.పాతిక కోట్ల డీల్‌ కూడా కుదుర్చుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక సౌత్‌ హీరోయిన్‌కు ఇప్పటి వరకు 5 కోట్లు చాలా ఎక్కువ.అలాంటిది ఈ అమ్మడితో ఏకంగా పాతిక కోట్ల డీల్‌ను కుదుర్చుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతా కూడా అవాక్కవుతున్నారు.ప్రస్తుతం సౌత్‌లో చాలా బిజీగా ఉన్న నయనతార ఆ సినిమాలన్నింటిని పక్కకు పెట్టేందుకు పాతిక కోట్ల ఆఫర్‌ ఇచ్చారు.వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించి 2021 చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఆ తర్వాత 2022లో రెండవ పార్ట్‌, 2023లో మూడవ పార్ట్‌ను విడుదల చేయబోతున్నారు.

Nayanatara As Seetha In Allu Aravind 3d Ramayana--Nayanatara As Seetha In Allu Aravind 3D Ramayana-