'పుష్ప' రెండు భాగాలకు కలిపి అంత బడ్జెట్ అవుతుందా..!

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.

 Allu Arjun Pushpa Two Parts Total Budget-TeluguStop.com

ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

 Allu Arjun Pushpa Two Parts Total Budget-పుష్ప’ రెండు భాగాలకు కలిపి అంత బడ్జెట్ అవుతుందా..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

పరిస్థితులు చక్కబడితే కానీ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యేలా లేదు.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

ఈ కథను కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం వీలుకాదని అందుకే రెండు భాగాలుగా విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు నిర్మాత మీడియాకు వివరించారు.బాహుబలి సినిమా తర్వాత రెండు భాగాలుగా విడుదల అవ్వబోతున్న సినిమా పుష్ప నే అవ్వడం విశేషం.యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు పెట్టే బడ్జెట్ గురించి వార్తలు వస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాకు 180 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని టాక్ వినిపించింది.అయితే ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల అవుతుండగా బడ్జెట్ కూడా పెరిగిందని తెలుస్తుంది.

లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు 200 నుండి 250 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.మరి చూడాలి ఈ సినిమా పూర్తి అయ్యే సరికి బడ్జెట్ ఎంత అవుతుందో.

#Sukumar #Two Parts #AlluArjun #Allu Arjun #250 Crore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు