పుష్ప కోసం సన్నీ ఐటెమ్..!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా పుష్ప.ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఊర మాస్ రోల్ లో నటిస్తున్నారు.

 Allu Arjun Pushpa Sunny Leone Item Song, Allu Arjun, Item, Latest News, Mytri Mo-TeluguStop.com

సినిమా విషయంలో ఎక్కడ తగ్గేదిలే అనుకుంటున్న సుకుమార్ సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ఐటం సాంగ్ లో బాలీవుడ్ భామలను దించాలని చూస్తున్నారు.

ముందు దిశా పటాని, జాక్వెలిన్ పేర్లు వినపడ్డా ఫైనల్ గా సన్నీ లియోన్ ను తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఐటం సాంగ్స్ కు సన్నీ తన గ్లామర్ యాడ్ చేయనుంది.

సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొడుతుందని అంటున్నారు.సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో ప్రతిది చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్న సుకుమార్.

సినిమా అంచనాలను ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో రికార్డులు కొల్లగొట్టారని చూస్తున్నారు.

అల్లు అర్జున్ మాత్రం పుష్ప సినిమా మీద చాలా ఫోకస్ గా ఉంటున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube