పుష్పకు అడవి కష్టాలు.. పాపం సుకుమార్!  

Allu Arjun Pushpa Sukumar - Telugu Allu Arjun, Pushpa, Rashmika Mandanna, Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తాజా చిత్రం పుష్పను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల వైకంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Allu Arjun Pushpa Sukumar

ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో వెంటనే తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర‌టైనర్‌గా సుకుమార్ తర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు.

పుష్పకు అడవి కష్టాలు.. పాపం సుకుమార్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా బన్నీతో చేయబోయే సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం అడవి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుంది.అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా అడవుల్లో షూటింగ్ జరుపుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

దీంతో సుకుమార్ అండ్ టీమ్, అడవి సెట్స్‌ను వేయడానికి ఆసక్తి చూపుతున్నారట.కానీ ఇదంత సులువుగా అయ్యే పని కాదని, దీనికి చాలా బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందని వారు ఆలోచిస్తున్నారు.

అయితే అడవిలో షూటింగ్ జరుపుకునేందుకు ప్రభుత్వం దగ్గర్నుండి ప్రత్యేక పర్మిషన్ తీసుకునేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మరి సుకుమార్‌కు ఈ అడవి కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Pushpa Sukumar Related Telugu News,Photos/Pics,Images..

footer-test