లేటెస్ట్ బజ్ : రెండు భాగాలుగా విడుదల కాబోతున్న పుష్ప !

ప్రస్తుతం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 Allu Arjun Pushpa Release In Two Parts-TeluguStop.com

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.రష్మిక మందన్న గిరిజన యువతిగా నటిస్తుంది.

ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

 Allu Arjun Pushpa Release In Two Parts-లేటెస్ట్ బజ్ : రెండు భాగాలుగా విడుదల కాబోతున్న పుష్ప -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమాను 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది.

అయితే ఈ సినిమా గురించి అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విషయం తెరపైకి వచ్చింది.ఇంతకు ముందు బాహుబలి సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

తాజాగా ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారని టాక్ నడుస్తుంది.

ఈ విషయంపై అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చర్చలు జరిగినట్లు టాక్ నడుస్తుంది.ఈ విషయంపై బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కథనాలు వస్తున్నాయి.మొదటి పార్ట్ కు సరిపడా ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యిందట.

ఈ భాగాన్ని దసరా సీజన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.అలాగే రెండో భాగాన్ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ఇప్పుడు టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

#Pushpa #Two Parts #Allu Arjun #Sukumar #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు