ఆ సమస్యతో బాధ పడుతున్న అల్లు అర్జున్.. పుష్ప లీక్స్!

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

 Allu Arjun Pushpa Problem Revealed Update,  Allu Arjun, Pushpa Movie, Problem, T-TeluguStop.com

అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా చిత్రంలో నటించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల
ముందుకు రానుంది.

సుకుమార్ పుష్ప సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మొదటి పార్ట్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో సందడి చేయనున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ వింత సమస్యతో బాధపడుతూ కనిపిస్తాడని సమాచారం వినబడుతోంది.

సాధారణంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలలో హీరోలను ఏదో ఒక అంగవైకల్యంతో చూపించడం మామూలే.ఈ క్రమంలోనే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ను చెవిటి పాత్రలో చూపించగా, అల్లు అర్జున్ ని కూడా అదే తరహాలో ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Problem, Pan India, Pushpa, Rashmika, Smuggler Role, Sukumar,

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ భుజం సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కేవలం ఎడమ చేతిని మాత్రమే కదిలిస్తూ డాన్స్ చేయడంతో అల్లు అర్జున్ ను పుష్ప సినిమాలో ఈ విధమైనటువంటి అంగవైకల్యంతో చూపించబోతున్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Problem, Pan India, Pushpa, Rashmika, Smuggler Role, Sukumar,

మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్ర బృందం ఈ విషయంపై అధికారకంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube