ఆ విషయంలో పోటీ పడుతున్న అఖండ మరియు పుష్ప

నందమూరి హీరో బాలకృష్ణ యంగ్‌ స్టార్‌ హీరోలతో పోటీ పడలేక ఎప్పుడో వెనుక పడిపోయాడు.దాదాపు దశాబ్ద కాలంగా ఆయన సినిమా లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.

 Allu Arjun Pushpa Movie Vs Nandamuri Balakrishna Akhanda Movie Teasers,social Me-TeluguStop.com

ఈ దశాబ్ద కాలంగా బాలయ్య సినిమా ల్లో కొన్ని మాత్రమే ఒక మోస్తరుగా ఆడాయి.ఆయన సక్సెస్‌ అయిన సినిమా లు వేళ్ల మీద లెక్కించవచ్చు.

ఇక సోషల్‌ మీడియా. యూట్యూబ్‌ రికార్డుల విషయం లో బాలయ్య ఎప్పుడు కూడా కనిపించిందే లేదు.

అలాంటి బాలయ్య ప్రస్తుతం యూట్యూబ్ లో బన్నీ రికార్డును బద్దలు కొడుతూ దూసుకు పోతున్నాడు.బన్నీ పుష్ప సినిమా టీజర్‌ 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.

కాని చాలా తక్కువ సమయంలో బాలయ్య ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు.నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా టీజర్‌ అద్బుతమైన రికార్డు దిశగా పరుగులు తీస్తోంది.

వారం పది రోజుల గ్యాప్ లో విడుదల అయిన పుష్ప మరియు అఖండ టీజర్ లు నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా తలబడుతున్నాయి.ఈ రెండు టీజర్ లు ఇప్పటికే 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్నాయి.

అతి తక్కువ సమయంలో 50 మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకున్న సినిమా గా అఖండ నిలిస్తే 60 మిలియన్ ల వ్యూస్ తో పుష్ప దూసుకు పోతుంది.మరి కొన్ని రోజుల్లో అఖండ టీజర్‌ కూడా 60 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుని అతి తక్కువ సమయంలో మళ్లీ అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా రికార్డ్‌ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.

మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత బాలయ్య తన సినిమా లతో స్టార్‌ లకు పోటీ ఇస్తున్నాడు.నందమూరి అభిమానులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు.అఖండ సినిమా తో బాలయ్య వంద కోట్ల వసూళ్లను సాధిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న అఖండ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

త్వరలోనే సినిమా షూటింగ్‌ ముగియబోతుంది.కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube