'పుష్ప' సెకండ్‌ పార్ట్‌ టైటిల్‌ లో చిన్న ట్విస్ట్‌

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా ఉత్సుకుత నెలకొంది.ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

 Allu Arjun Pushpa Movie Two Parts Title Different-TeluguStop.com

అల్లు అర్జున్‌ గత చిత్రం అల వైకుంఠపురంలో మరియు సుకుమార్ గత చిత్రం రంగస్థలం లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.అందుకే వీరి కాంబోలో రూపొందుతున్న సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

పుష్ప సినిమా కు సంబంధించిన పోస్టర్‌ మరియు టీజర్ లు సినిమా పై అంచనాలు ఆకాశానికి పెంచేశాయి.ఈ సమయంలో సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

 Allu Arjun Pushpa Movie Two Parts Title Different-పుష్ప’ సెకండ్‌ పార్ట్‌ టైటిల్‌ లో చిన్న ట్విస్ట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుకుమార్‌ ఇప్పటికే రెండు పార్ట్‌ లకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశారు.సాదారణంగా సినిమా రెండు పార్ట్ లు అంటే 1 మరియు 2 అంటూ పెడతారు.

పుష్పకు కూడా పుష్ప 1 మరియు పుష్ప 2 అంటూ టైటిల్స్ ను ఖరారు చేస్తారని అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా టైటిల్‌ విషయంలో సుకుమార్‌ ట్విస్ట్‌ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

పుష్ప సినిమా రెండవ పార్ట్‌ కు టైటిల్‌ ను మరోటి పెట్టే అవకాశాలు ఉన్నాయి.మొదటి పార్ట్‌ కు పుష్ప నే ఉంచేసి రెండవ పార్ట్‌ టైటిల్‌ ను మరోటి పెట్టి సబ్ టైటిల్‌ అన్నట్లుగా పుష్ప 2 అంటూ పిలుస్తారట.

అంటే పుష్ప రెండు పార్ట్‌ లు కూడా రెండు విభిన్నమైన టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ రెండు సినిమా లకు సంబంధించిన కథ ఒక్కటేనా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

రెండవ పార్ట్‌ కు సంబంధించిన అద్బుతమైన ట్విస్ట్‌ ను మొదటి పార్ట్‌ క్లైమాక్స్ లో చూపిస్తారని అంటున్నారు.పుష్ప సినిమా కథ మరియు కథనం రెండు పార్ట్‌ ల్లో కూడా మాస్ మరియు క్లాస్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

#Pushpa #Allu Arjun #Sukumar #FilmNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు