పుష్ప రెండు పార్ట్‌ ల మద్య ఇంకోటి.. ట్విస్ట్‌ ఇచ్చిన బన్నీ సన్నిహితుడు

అల్లు అర్జున్‌ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రస్తుతం పుష్ప చేస్తున్న అల్లు అర్జున్‌ రాబోయే రెండు ఏళ్లలో ఏకంగా ఆరు సినిమాలను చేయబోతున్నట్లుగా నిర్మాత బన్నీ వాసు ప్రకటించాడు.

 Allu Arjun Pushpa Movie Two Parts Interesting Update-TeluguStop.com

నేడు బన్నీ వాసు పుట్టిన రోజు.ఈ సందర్బంగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అర్జున్‌ కు గతంలో పీఆర్ గా వ్యవహరించిన బన్నీ వాసు ఇప్పటికి కూడా ఆయన సినిమా వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటాడు.ప్రస్తుతం బన్నీ చేస్తున్న సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు అన్ని చూసే బన్నీ వాసు ఆయన రాబోయే ఆరు సినిమా ల గురించి క్లారిటీ గా చెప్పడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

 Allu Arjun Pushpa Movie Two Parts Interesting Update-పుష్ప రెండు పార్ట్‌ ల మద్య ఇంకోటి.. ట్విస్ట్‌ ఇచ్చిన బన్నీ సన్నిహితుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పుష్ప సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

Telugu Allu Arjun, Allu Arjun Pushpa, Bunny Vasu, Film News, Movie News, Pushpa-Movie

పుష్ప రెండు పార్ట్‌ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.అయితే రెండు పార్ట్‌ ల మద్య మరో సినిమా వస్తుందని అంటున్నారు.అంటే పుష్ప సినిమా మొదటి పార్ట్‌ విడుదల అయిన తర్వాత ఐకాన్‌ సినిమా తో బన్నీ ప్రేక్షకులమ ఉందుకు వస్తాడట.

ఆ తర్వాత పుష్ప 2 వ పార్ట్‌ ను సుకుమార్‌ విడుదల చేయాలని భావిస్తున్నాడు.అంటే పుష్ప రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతున్నా కూడా మద్యలో బన్నీ ఐకాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మూడు సినిమా లో పాటు మురుగదాస్‌.బోయపాటి మరియు కొరటాల శివ సినిమా కూడా ఉంటుందని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.ఆయన చెప్పిన దాని ప్రకారం రాబోయే రెండేళ్లలో బన్నీ ఏకంగా ఆరు సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

#Bunny Vasu #Allu Arjun #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు