పుష్ప ట్రైలర్‌ రిలీజ్‌ కు ముహూర్తం ఫిక్స్.. ముంబయిలో తగ్గేదేలే

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఫాహద్‌ ఫాజిల్ మరియు సునీల్‌ లు విలన్ లుగా నటిస్తుండగా అనసూయ కీలక పాత్రలో తెరకెక్కిన పుష్ప విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే నెలలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.

 Allu Arjun Pushpa Movie Trailer Release Date Fix, Allu Arjun  , Pushpa Movie , T-TeluguStop.com

మొన్నటి వరకు ఈ సినిమా హిందీ లో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.తాజగా ఏఏ ఫిల్మ్స్ వారు ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమా చిత్రీకరణ సమయంలోనే అంచనాలు పీక్స్ కు చేరాయి.అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు.

బన్నీకి ఇదో మంచి పాన్‌ ఇండియా సినిమా గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఇక పుష్ప సినిమా టీజర్ సాంగ్స్.

గ్లిమ్స్ అని చాలానే వచ్చాయి.కాని ఇప్పటి వరకు సినిమా ట్రైలర్ ను విడుదల చేయలేదు.

మరి ఈ సినిమా ట్రైలర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో డిసెంబర్‌ 2వ తారీకున భారీగా ముంబయిలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలీవుడ్ స్టార్‌ హీరో ఒకరు ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నాడట.

సినిమా చిత్రీకరణ పూర్తి చేయడంతో పాటు సమంత ఐటెం సాంగ్‌ ను ప్రకటించి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు.మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

అల్లు అర్జున్‌ మొదటి సారి హిందీ ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వార వెళ్లబోతున్నాడు.

Telugu Allu Arjun, Bollywood, Kollywod, Pushpa, Sukumar-Movie

ఇప్పటి వరకు శాటిలైట్ మరియు ఓటీటీ ద్వారా మాత్రమే ఈయన ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు.ఈ సినిమా చిత్రీకరణ కోసం బన్నీ పడ్డ కష్టం అందరికి తెల్సిందే.ట్రైలర్ విడుదల తర్వాత సినిమా స్థాయి మరింతగా పెరుగుతుందని అంటున్నారు.

వచ్చే నెలలో విడుదల కాబోతున్న పుష్ప సినిమా 200 నుండి 250 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.మలయాళం మరియు ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube