పుష్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే..?

2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల థియేటర్లు మూతబడటంతో గతేడాది విడుదల కావాల్సిన సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి.గతేడాది షూటింగ్ పూర్తి చేసుకోని సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.

 Alluarjuna Pushpa Movie Teaser Release Date  Fixed,  Allu Arjun,   News Viral,-TeluguStop.com

అలా కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడుతూ షూటింగ్ ఆలస్యమైన సినిమాల్లో పుష్ప మూవీ కూడా ఒకటి.ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి క్లాస్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్ ఈసారి మాత్రం రూటు మార్చి బన్నీని ఊహించని లుక్ లో పుష్ప మూవీలో చూపించబోతున్నారు.ఈ సినిమా కోసం బన్నీ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేయడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Telugu Allu Arjun, Pushpa, Teaser-Latest News - Telugu

ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేద్దామని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇప్పటికే ఈ ఏడాది విడుదల కాబోతున్న చాలా సినిమాలకు సంబంధించిన టీజర్లు విడుదలైన నేపథ్యంలో పుష్ప టీజర్ ను కూడా విడుదల చేద్దామని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో బన్నీ పాత్ర గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.బన్నీకి జోడీగా రష్మిక ఈ మూవీలో నటిస్తున్నారు.

రష్మిక ఈ మూవీలో డీ గ్లామరస్ లుక్ లో గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube