మొదట అనుకున్నట్లుగానే ‘పుష్ప’ షూటింగ్‌  

allu arjun pushpa movie shooting update Allu Arjun, Pushpa, Sukumar, Kerala Movie Shooting, Rashimikha Mandhana, Ala Vaikuntapuramlo - Telugu Ala Vaikuntapuramlo, Allu Arjun, Kerala Movie Shooting, Movie News, Pushpa, Rashimikha Mandhana, Rashmika Mandanna, Sukumar, Telugu News

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న పుష్ప సినిమా షూటింగ్‌ ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించాల్సి ఉంది.కానీ ఆ సమయంలో అల వైకుంఠపురం లో సినిమా విడుదల హడావుడి ఉండడంతో అల్లు అర్జున్ కాస్త ఆలస్యం చేశాడు.

TeluguStop.com - Allu Arjun Pushpa Movie Shooting Update

ఆ సినిమా విడుదలైన తర్వాత అంటే ఏప్రిల్ నుండి పుష్ప షూటింగ్‌ ను కేరళలోని అడవుల్లో చేయాలనుకున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దర్శకుడు సుకుమార్ చేశాడు.

షూటింగ్ కు ఒకటి రెండు వారాల్లో వెళ్తాము అనుకుంటు ఉండగా కరోనా విజృంభించడంతో భారత్ లో లాక్ డౌన్ విధించారు.దాంతో గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్‌ ఏవీ జరగడం లేదు.

TeluguStop.com - మొదట అనుకున్నట్లుగానే పుష్ప’ షూటింగ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కరోనా కారణంగా కేరళకు వెళ్లి అక్కడ షూటింగ్ చేయడం ఇబ్బంది అనుకున్న దర్శకుడు సుకుమార్ ఏపీ లేదా తెలంగాణలోని అడవుల్లో షూట్ చేయాలనుకున్నారు.అందుకోసం పలు చోట్ల లొకేషన్లు కూడా ఎంపిక చేశారు.

కాని చివరకు మళ్లీ కేరళలో షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే నెల రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ కేరళలోని అడవుల్లో ప్రారంభించబోతున్న చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటించనున్న విషయం తెలిసిందే.కీలక పాత్రకు గాను విజయ్ సేతుపతిని సంప్రదించారు.

అయితే ఆయన షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో తప్పుకున్నట్లుగా వార్తలు వార్తలు వచ్చాయి.అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

#Pushpa #Sukumar #KeralaMovie #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Pushpa Movie Shooting Update Related Telugu News,Photos/Pics,Images..