పుష్ప మేకర్స్‌ అలసత్వంతో విడుదలకు సమస్యలు

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.సెకండ్‌ వేవ్‌ కు ముందు సినిమాను ఆగస్టులో విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

 Allu Arjun Pushpa Movie Release Date Issue-TeluguStop.com

ఇప్పుడు ఆగస్టులో అసాధ్యం.షూటింగ్‌ ముగియడానికే సెప్టెంబర్‌ పడుతుంది.

కనుక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి.కాని తాజాగా సంక్రాంతికి సర్కారు వారి పాట, రానా పవన్‌ మూవీతో పాటు రాధే శ్యామ్‌ మూవీ కూడా ఫిక్స్ అయ్యాయి.

 Allu Arjun Pushpa Movie Release Date Issue-పుష్ప మేకర్స్‌ అలసత్వంతో విడుదలకు సమస్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏకంగా డేట్లను కూడా వారు ప్రకటించారు.దాంతో పుష్ప విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది.

ఈ ఏడాది చివరి వరకు విడుదలకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి.కనుక వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని అనుకున్నారు.

పుష్ప మేకర్స్ విడుదల తేదీ బ్లాక్ చేసుకోవడంలో విఫలం అయ్యారు.కనుక ఇప్పుడు ఫిబ్రవరి వరకు ఆగుతారా అనేది చూడాలి.

ఒక వేళ వచ్చే ఏడాది అంతా బాగుండి విద్యా సంస్థలు రన్‌ అయితే అప్పుడు పుష్ప సినిమా ను ఫిబ్రవరి మరియు మార్చిలో విడుదల చేయడానికి ఉండదు.ఎందుకంటే పరీక్షల సీజన్‌ అప్పుడు ఉంటుంది కనుక.

పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమాను మంచి సమయం చూసి విడుదల చేయాల్సి ఉంటుంది.

Telugu Allu Arjun, Allu Arjun Pushpa Movie Release Date Issues, Pushpa, Pushpa Movie Update, Pushpa Release Date, Release Date Issues, Sankranti 2022, Second Wave, Sukumar, Summer-Movie

అంటే సమ్మర్ లో విడుదల చేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్‌ కు ముందే సినిమా షూటింగ్‌ ను ముగించాలని భావిస్తున్నారు.కనుక ఈ ఏడాది చివర్లో ఏదో ఒక తేదీన విడుదల చేస్తే బెటర్‌ అనే నిర్ణయానికి కూడా రావచ్చు అంటున్నారు.

మొత్తానికి పుష్ప మేమకర్స్ అలసత్వం వల్ల సినిమాకు ఇప్పుడు సరైన తేదీ విషయంలో సమస్యలు తలెత్తాయి.

#Summer #PushpaMovie #ReleaseDate #Second Wave #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు