'పుష్ప' రెండు పార్ట్‌ లపై సుకుమార్‌ శిష్యుడి మాట ఇదే

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ పుకారు షికారు చేస్తోంది.

 Allu Arjun Pushpa Movie Not Releasing In Two Parts-TeluguStop.com

పుష్ప సినిమా కథను ఒక్క పార్ట్‌ లో చూపించడం సాధ్యం అయ్యే పని కాదు.అందుకే ఈ సినిమా ను సుకుమార్ రెండు పార్ట్‌ లు గా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడు అంటున్నారు.

సినిమా కు ఉన్న బజ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌ ను పెడుతున్నారు.ఆ బడ్జెట్‌ రికవరీ అవ్వాలంటే రెండు పార్ట్‌ లు విడుదల అయితే తప్ప లాభాలు వచ్చే అవకాశం లేదు అంటున్నారు.

 Allu Arjun Pushpa Movie Not Releasing In Two Parts-పుష్ప’ రెండు పార్ట్‌ లపై సుకుమార్‌ శిష్యుడి మాట ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే అల్లు అర్జున్‌ పుష్ప సినిమా ను రెండు పార్ట్‌ లు గా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమా రెండు పార్ట్‌ ల విషయంలో అస్సలు నిజం లేదట.

పుష్ప సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న ఒక సహాయ దర్శకుడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

సుకుమార్‌ శిష్యుడి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పుష్ప గురించిన అలాంటి ప్రస్థావనే రాలేదు.

సోషల్‌ మీడియాలో ఎవరో ఒకరు మొదలు పెట్టిన ప్రచారంను అనవసరం గా మీడియా రాద్దాంతం చేస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశాడు.మీడియా లో పుష్ప గురించి వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేల్చి చెప్పాడు.

మొత్తానికి పుష్ప సినిమా రెండు పార్ట్‌ లు గా రావడం లేదని మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యుడే క్లారిటీ ఇచ్చాడు.కనుక ఖచ్చితంగా సినిమా సింగిల్‌ గానే వస్తుంది అనేది తేలిపోయింది.

అల్లు అర్జున్ ఈ సినిమా లో ఎర్ర చందనం స్మగ్లింగ్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా లో బన్నీ కి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.

మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

#Pushpa #Allu Arjun #Bunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు