పుష్పకు ఖచ్చితంగా ఇది కలిసి వచ్చే విషయం.. వసూళ్లు కుమ్మేయడం ఖాయం

అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తారా లేదా అనే విషయమై సస్పెన్స్ వీడింది.

 Allu Arjun Pushpa Movie Latest Update, Allu Arjun, Pushpa, Tollywood, Sukumar, R-TeluguStop.com

సౌత్ భాషల్లోనే కాకుండా మొత్తం ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా కేవలం సౌత్ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతంలో కూడా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

పుష్ప కు కలిసి వచ్చే విషయం ఏంటంటే బాలీవుడ్లో తెరకెక్కిన ఏ సినిమాగాని.  క్రేజీ మూవీ గాని పుష్ప వచ్చే టైం లో విడుదల కావడం లేదు.

అందుకే అల్లు అర్జున్ తనకున్న క్రేజ్ తో అక్కడ భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ ఇప్పటికే తన పాత సినిమాలతో శాటిలైట్ ద్వారా ఉత్తరాది అభిమానులను దక్కించుకున్నాడు.

ఈ సినిమాతో డైరెక్ట్ థియేటర్ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.సుకుమార్ టేకింగ్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ రష్మిక మందన అందం అన్నీ ఈ సినిమాకు కలిసి వస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాసిల్ నిలుస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా ప్రతి ఒక్క సినీ అభిమానుల్ని మెప్పించేలా మాస్ ఎలిమెంట్స్తో పాటు క్లాస్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుందని మేకర్ చెబుతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్టు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Box, Pushpa December, Sukumar, Toll

అల్లు అర్జున్ రెండు సంవత్సరాలుగా పొడవాటి జుట్టు మరియు గడ్డంతో ఉన్నాడు.రష్మిక ఈ సినిమాలో డి గ్లామర్ గా కనిపించబోతుంది.పుష్ప రెండు పార్టులుగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

వచ్చే నెల అంటే డిసెంబర్ లో మొదటి పార్ట్ రాబోతుండగా రెండవ పార్ట్  వచ్చే ఏడాది 2022లో చివరికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.కేజిఎఫ్ ను మించి యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయంటూ చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కూడా పుష్ప సినిమాపై ఆసక్తి నెలకొంది.

మరి సుకుమార్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube