లేటెస్ట్ బజ్.. 'పుష్ప' ఆల్బమ్ మరొక రేంజ్ లో ఉంటుందంటున్న మేకర్స్ !

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.గత సంవత్సరం వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని అదే జోష్ తో ఈ సినిమా స్టార్ట్ చేసాడు.

 Allu Arjun Pushpa Movie Latest Update-TeluguStop.com

ఇప్పటికే వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ లోని కొత్త కోణాలను బయట పెట్టాయి.

ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.ఆర్య, ఆర్య 2 సినిమాలు మ్యూజిక్ పరంగా ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే అలాగే ఇప్పుడు తెరకెక్కుతున్న పుష్ప సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా వేరే రేంజ్ లో ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

 Allu Arjun Pushpa Movie Latest Update-లేటెస్ట్ బజ్.. పుష్ప’ ఆల్బమ్ మరొక రేంజ్ లో ఉంటుందంటున్న మేకర్స్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పుష్ప ఆల్బమ్ ను ఇప్పటికే రెడీ చేసిన దేవి శ్రీ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఆల్బమ్ రెడీ చేసాడట.

Telugu Allu Arjun, Allu Arjun Pushpa Movie Latest Update, Devi Sri Prasad, Pushpa, Pushpa Movie Update, Rashmika Mandanna, Special Song, Sukumar-Latest News - Telugu

పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా రెడీ చేసారని మేకర్స్ అనధికారికంగా చెబుతున్న మాట.త్వరలోనే పుష్ప నుండి మ్యూజిక్ ఆల్బమ్ కు సంబంధించి అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది.ఇది ఇలా ఉంటే ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.

ఈయనకు జోడీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Allu Arjun, Allu Arjun Pushpa Movie Latest Update, Devi Sri Prasad, Pushpa, Pushpa Movie Update, Rashmika Mandanna, Special Song, Sukumar-Latest News - Telugu

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మొదటి భాగం షూట్ 90 శాతం మేరకు పూర్తి అయ్యింది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టారు.ఆ కొద్దీ భాగం కూడా పూర్తి చేసి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సుకుమార్ గట్టిగ ప్రయత్నిస్తున్నాడు.

#Pushpa #AlluArjun #Allu Arjun #PushpaMovie #Special Song

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు