'పుష్ప' దాక్కో దాక్కో మేక పబ్లిక్ టాక్‌

అల్లు అర్జున్‌ మోస్ట్‌ క్రేజీ అండ్‌ అవైటెడ్‌ మూవీ పుష్ప మొదటి పార్ట్‌ విడుదలకు సిద్దం అవుతోంది.తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేశారు.

 Allu Arjun Pushpa Movie First Song Dakko Dakko Meka Review,latest Tollywood News-TeluguStop.com

పుష్ప లో అల్లు అర్జున్‌ మాస్ గా కనిపిస్తాడని అందరికి తెలుసు.కాని మరీ ఇంత మాస్‌ అనుకోలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బన్నీని ఇలా చూడలేక పోతున్ఆనం అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇదే రచ్చరా బాబోయ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.అల్లు అర్జున్‌ మరియు రష్మికల లుక్ లు అత్యంత మాసీ లుక్ లో ఉండటం వల్ల సినిమా క్లాస్ ఏ వారికి నచ్చుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.సామ్రాట్‌ ఆఫ్‌ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్‌ మొదటి పాటను విడుదల చేసే ముందు హైప్ మరీ ఎక్కువగా క్రియేట్‌ చేశాడు.

అయితే ఆ హైప్ కు తగ్గట్లుగా పాట లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Telugu Allu Arjun, Pushpa-Movie

దేవి శ్రీ అభిమానులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు పాట వచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.కాని పాట మాత్రం కొందరికి బాబోయ్‌ అన్నట్లుగా ఉంటే కొందరు మాత్రం వావ్ అంటున్నారు.

అన్ని పాటలు ఇలాగే ఉంటాయా బాబు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.లిరిక్స్ కొందరికి నచ్చితే కొందరికి మాత్రం అర్థమే కావడం లేదు అంటున్నారు.

మొత్తానికి పుష్ప సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎదురు చూసిన అభిమానులు పాట వచ్చిన తర్వాత మరింతగా అంచనాలు పెంచుకున్నారు.అల్లు అర్జున్‌ తో ఈ సినిమా లో సునీల్‌ ఢీ కొట్టబోతున్నాడు.

సినిమా లో మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నాడు.సినిమా లో ఆయన సన్నివేశాలు తక్కువే.

అయితే పుష్ప 2 లో మాత్రం ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.బన్నీ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube