వైరల్ అవుతున్న పుష్ప ఫేక్ ట్రైలర్... కానీ బాగుందట...

తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే యువకుడు పాత్రలో నటిస్తున్నాడు.

 Allu Arjun Pushpa Movie Fake Trailer Viral In Facebook-TeluguStop.com

నిన్న మొన్నటి వరకు కొంతమేర క్లాస్ లుక్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక్కసారిగా మాస్ లుక్ లో కనిపించేసరికి ఈ చిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు 30 శాతం వరకు పూర్తయ్యాయి.

 Allu Arjun Pushpa Movie Fake Trailer Viral In Facebook-వైరల్ అవుతున్న పుష్ప ఫేక్ ట్రైలర్… కానీ బాగుందట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేంటీ… ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ విడుదల కాలేదు కదా అని మీరు అనుకుంటున్నారా.? అవును.  నిజమే కానీ కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన  “ఖైదీ” చిత్ర సన్నివేశాలను తీసుకొని అందులో అల్లు అర్జున్ ఫొటోలతో ఓ ట్రైలర్ ని రూపొందించారు. ఈ ట్రైలర్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

అంతేగాక ఈ ట్రైలర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది సమయంలో దాదాపుగా వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్నటువంటి క్రేజ్ ఏమిటో అని.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న  తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఉన్నట్లుండి తప్పుకోవడంతో అతడి స్థానంలో టాలీవుడ్ ప్రముఖ హీరో “నారా రోహిత్” నటిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో నారా రోహిత్ నటిస్తున్న వినిపిస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు స్పందించ లేదు.

#Allu Arjun #PushpaMovie #Stylish Star #PushpaMovie #PushpaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు