కొరటాల దెబ్బకు ఆగమైపోయిన ఐకాన్  

Allu Arjun Not Interested In Icon Movie, Allu Arjun, Pushpa, Koratala Siva, Icon, Venu Sriram - Telugu Allu Arjun, Icon, Koratala Siva, Pushpa, Venu Sriram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల వైకుంఠపురములో చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.

 Allu Arjun Pushpa Koratala Siva Icon Venu Sriram

ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంతోనూ బ్లాక్‌బస్టర్ మూవీ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే బన్నీ గతంలో ఓ సినిమాను అనౌన్స్ చేసినా ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదు.దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో బన్నీ ఐకాన్ అనే సినిమాను ఓకే చేశాడు.

కొరటాల దెబ్బకు ఆగమైపోయిన ఐకాన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఆ సినిమాను ప్రారంభించలేదు.దీంతో త్రివిక్రమ్‌తో సినిమా చేసిన బన్నీ, ఇప్పుడు సుకుమార్, ఆ తరువాత కొరటాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అయితే ఐకాన్ చిత్రాన్ని బన్నీ పక్కనపెట్టేశాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.వేణు శ్రీరామ్ కూడా వకీల్ సాబ్ చిత్రంతో బిజీగా ఉండటంతో ఐకాన్‌ను పక్కనబెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఏదేమైనా కొరటాల శివతో సినిమా కారణంగా బన్నీ ఐకాన్ చిత్రాన్ని పక్కనబెట్టాడనే వాదన బలంగా వినిపిస్తోంది.ఇక ఈ సినిమాను తాజాగా అనౌన్స్ చేసిన బన్నీ, పుష్ప చిత్రంలో మాస్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Allu Arjun #Koratala Siva #Icon #Venu Sriram #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Pushpa Koratala Siva Icon Venu Sriram Related Telugu News,Photos/Pics,Images..