ఎన్టీఆర్ రికార్డును లేపేసిన బన్నీ  

Allu Arjun Pushpa First Look Surpasses Ntr Record - Telugu Allu Arjun, Aravinda Sametha, First Look, Ntr, Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ చాలా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

 Allu Arjun Pushpa First Look Surpasses Ntr Record

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బన్నీ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా మాసీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ పోస్టర్‌ను తెగ షేర్‌ చేస్తున్నారు.దీంతో ఈ పోస్టర్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నడుస్తోంది.కాగా ఈ పోస్టర్‌కు ట్విట్టర్‌లో 24 గంటల సమయంలో ఏకంగా 84.1K లైకులు రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ స్థాయిలో లైకులు సాధించడంతో అత్యధిక లైకులు అందుకున్న పోస్టర్‌గా పుష్ప ఫస్ట్ లుక్‌ ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

ఎన్టీఆర్ రికార్డును లేపేసిన బన్నీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అత్యధికంగా 70.20K లైకులు వచ్చాయి.తారక్ పేరుపై ఉన్న రికార్డును బన్నీ ఎగరేసుకుపోవడంతో ఇప్పుడు పుష్ఫ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు