స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురములో సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో పూర్తి సక్సెస్ సాధించింది.
ఇక ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించి షూటింగ్ కూడా ప్రారంభించాడు.
ఇక ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా వస్తుందని చిత్ర వర్గాలు తెలపడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ చాలా రఫ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.దీనికి సంబంధించి బన్నీ పలుసార్లు మాస్ లుక్‌తో కంటపడటంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాకు తొలుత శేషాచలం అనే టైటిల్ వినిపించినా, తాజాగా పుష్ప అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాలో బన్నీ పేరు పుష్ప రాజ్ అని, ఆయన ఒక లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.పూర్తి మాస్ లుక్‌తో బన్నీ ప్రేక్షకులను థ్రిల్ చేశాడు.
సుకుమార్‌తో కలిసి బన్నీ హ్యా్ట్రిక్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.