వేలిముద్రలు కాదంటున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.బన్నీ సరికొత్త మాస్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Allu Arjun, Pushpa, Finger Prints, First Look, Sukumar-TeluguStop.com

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమా టైటిల్‌పై వేలుముద్రలు ఉన్నట్లు, ఇవి సినిమా కథలో చాలా కీలకం కానున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.

 Allu Arjun, Pushpa, Finger Prints, First Look, Sukumar-వేలిముద్రలు కాదంటున్న పుష్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ పోస్టర్‌లో ఉన్నవి వేలిముద్రలు కావని, చెట్టును మధ్యలో నరికితే ఏర్పడే గుర్తులు అని తెలుస్తోంది.ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో, ఈ పోస్టర్‌లో దానికి చిహ్నంగా ఈ గుర్తులు చూపించారని తెలుస్తోంది.

మొత్తానికి సుకుమార్ క్రియేటివిటీకి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ముగ్ధులవుతున్నారు.బన్నీ ఊరమాస్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను 2021 ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube