మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత మెగాస్టార్ ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు.
మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు అప్పగించారు.అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు బన్నీ ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వర్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు చిత్ర యూనిట్ వరకు చేరడంతో వారు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో బన్నీ నటించడం లేదని వారు కన్ఫం చేశారు.
బన్నీ ప్రస్తుతం పుష్ప చిత్రంపైనే తన పూర్తి ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది.మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.