రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. కారణం ఆ దర్శకుడే..?  

దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్.అయితే చాలామంది స్టార్ హీరోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నా అల్లు అర్జున్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

TeluguStop.com - Allu Arjun Playing Politician Role In Koratala Shiva Movie

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో చిరంజీవికి అనుకూలంగా కామెంట్లు చేసిన అల్లు అర్జున్ ఆ తరువాత మాత్రం రాజకీయపరమైన విషయాలలో జోక్యం చేసుకోలేదు.
అయితే రియల్ రాజకీయాలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మాత్రం పొలిటికల్ లీడర్ పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ను ఈ సినిమాలో కొరటాల శివ కొత్తగా చూపించబోతున్నాడని.ఈ సినిమాలో స్టూడెంట్ గాను, పొలిటికల్ లీడర్ గాను అల్లు అర్జున్ కనిపిస్తాడని సమాచారం.

TeluguStop.com - రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. కారణం ఆ దర్శకుడే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తన సినిమాల్లో మెసేజ్ ఉండేలా చూసుకునే కొరటాల శివ కథలో పేదరికం, నిరక్షరాస్యత గురించి ప్రస్తావించాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమాను తెరకెక్కించనున్నారు.సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నారు.అల్లు అరవింద్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ తరువాత కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ కెరీర్ లో మళ్లీ గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

అల్లు అర్జున్ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలను ఎక్కువగా ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.

#AlluArjun #KoratalaShiva #AlluArjun #Allu Arjun #Politician Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Playing Politician Role In Koratala Shiva Movie Related Telugu News,Photos/Pics,Images..