ఏయూ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్న అల్లు అర్జున్  

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది.

TeluguStop.com - Allu Arjun Play Student Leader Role In Koratala Movie

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఉండబోతుంది.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు.ప్రస్తుతంఆచార్య షూటింగ్ లో ఉన్న కొరటాల దానిని పూర్తి చేసిన వెంటనే అల్లు అర్జున్ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టబోతున్నాడు.

TeluguStop.com - ఏయూ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్న అల్లు అర్జున్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ మూవీకి సంబంధించి థీమ్ పోస్టర్ ని కూడా విడిచిపెట్టారు.వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటన నేపధ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇప్పటి వరకు కనిపించని భిన్నమైన పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.ఆంధ్రా యూనివర్శిటీ స్టూడెంట్ గా అతని పాత్ర ఉండబోతుందని, యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్ గా ఉంటూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన యువకుడుగా అతనిని కొరటాల తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

మరి స్టూడెంట్ పాలిటిక్స్ తెరకెక్కబోతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ లిస్ట్ లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకోవడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.తెలుగులో పొలిటికల్ థ్రిల్లర్ కథలకి ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ నేపధ్యంలో కొరటాల, బన్నీ కాంబినేషన్ లో రాబోయే ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి కూడా మంచి బజ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

#Pan India Movie #Bunny #Allu Arjun #Koratala Siva #Student Leader

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Play Student Leader Role In Koratala Movie Related Telugu News,Photos/Pics,Images..