స్ట్రైట్ హిందీ సినిమా చేసే యోచనలో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్.మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాత అల్లు అరవింద్ వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బన్నీ.

 Allu Arjun Planning Straight Hindi Movie, Tollywood, Pushpa Movie, Sukumar, Allu-TeluguStop.com

సినిమా సినిమాకి తనని తాను మెరుగు పరుచుకుంటూ కొత్త కొత్త క్యారెక్టర్స్, లుక్స్ ట్రై చేస్తూ, అలాగే కమర్షియల్ జోనర్ లోనే కాస్తా భిన్నమైన కథలని ఎంచుకుంటూ హీరోగా తన జర్నీని కొనసాగిస్తున్నాడు.గత ఏడాది అల వైకుంఠపురంతో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ ఆ సినిమా సాంగ్స్ తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా ఫేమస్ అయిపోయాడు.

ఇక అల్లు అర్జున్ సినిమాలకి హిందీ డబ్బింగ్ లో మంచి డిమాండ్ ఉంది.

Telugu Allu Aravind, Allu Arjun, Pushpa, Hindi, Sukumar, Tollywood-Movie

నార్త్ ప్రేక్షకులు అల్లు అర్జున్ సినిమాలని విపరీతంగా వీక్షిస్తూ ఉంటారు.అలాగే అతని స్టైల్ కి ఫాన్స్ కూడా ఉన్నారు.ఈ నేపధ్యంలో బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో పడ్డాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నార్త్ ఇండియా ప్రేక్షకులని డైరెక్ట్ గా పలకరించబోతున్నాడు.ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే దీని తర్వాత అల్లు అర్జున్ స్ట్రైట్ హిందీ సినిమా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇప్పుడు బన్నీ కోసం ఆ దిశగానే అడిగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.తన తండ్రికి బాలీవుడ్ లో ఎలాగూ మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఓ స్టార్ దర్శకుడుతో తన ఎంట్రీ ఉండే విధంగా బన్నీ ప్లాన్ చేసుకుంటున్నట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube