ఆ హిట్ మూవీ ని రీమేక్ చేద్దామని అనుకున్న బన్నీ

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అల్లు అర్జున్.మెగా హీరో అనే ఇమేజ్ తో కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకొని స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందాడు.

 Allu Arjun Plan To Remake Bollywood Hit Movie-TeluguStop.com

ఇక ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చి పోజిటివ్ టాక్ అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకంటే ముందుగా బన్నీకి నా పేరు సూర్యతో డిజాస్టర్ వచ్చింది.

దీంతో ఈ సారి ఎంటర్టైన్మెంట్ తో రావాలని ప్లాన్ చేస్తూ హిందీ హిట్ మూవీ అయిన సోనూకి టిటూకు స్వీటీ అనే సినిమాని రీమేక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అయితే ఆ సినిమా కంటే త్రివిక్రమ్ చెప్పిన స్టొరీ భాగా నచ్చడంతో అల వైకుంఠపురంలో స్టార్ట్ చేసినట్లు చెప్పారు.చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి వంద కోట్ల కలెక్షన్ తెచ్చుకుంది.

అయితే బన్నీ ఈ సినిమా వదిలేయడంతో ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్ లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube