బుల్లితెరపై అల్లు అర్జున్ సందడి.. ప్రోమో రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్?

ప్రస్తుతం వెండితెరపై పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై బుల్లితెరపై సందడి చేయనున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పాల్గొన్న ఓ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

 Allu Arjun Dhee 13 Promo Goes Viral In Social Media,  Allu Arjun, Tollywood, Her-TeluguStop.com

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే అల్లు అర్జున్ పూర్తిగా బుల్లితెరపై ఏదైనా కార్యక్రమం ద్వారా సందడి చేస్తారు అనుకుంటే పొరపాటు పడినట్లే.

అల్లు అర్జున్ కేవలం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ 13 డాన్స్ షోకి అతిథిగా హాజరుకానున్నారు.ఇప్పటివరకు ఢీ 12 వరకు   ఎంతోమందిని సందడి చేసిన ఈ కార్యక్రమం ఢీ 13 ఫైనల్స్ కి చేరుకోవడంతో ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన బోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వేదికపై డాన్సర్స్ ఏంది బిడ్డా.

ఇది నా అడ్డా అనే పాటకు డాన్స్ చేస్తుండగా అల్లు అర్జున్ ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఈ పాటకు డాన్సర్స్ తో కలిసి అల్లు అర్జున్ కూడా స్టెప్పులు వేయడం ప్రస్తుతం హైలెట్ గా మారింది.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలియడంతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube