బిగ్‌బాస్‌ 1, 2 ఆఫర్‌ వచ్చింది.. 3 కి నన్ను ఎవరు అడగలేదు, బిజీ

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి హోస్ట్‌ ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.ఎంతో మంది హీరోల పేర్లు ప్రస్థావనకు వస్తున్నాయి.

 Allu Arjun On Bigg Boss Rumors 1 2-TeluguStop.com

ఇలాంటి సమయంలో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి అల్లు అర్జున్‌ హోస్ట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.తాజాగా ఆ విషయమై అల్లు అర్జున్‌ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాతో బిజీగా ఉన్న కారణంగా బిగ్‌బాస్‌ను చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది

బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కే నన్ను హోస్ట్‌గా ఉండమంటూ కొందరు నా వద్దకు వచ్చారు.

నాన్న కూడా నన్ను బిగ్‌బాస్‌ హోస్టింగ్‌కు ఒప్పించే ప్రయత్నం చేశాడు.కాని నేను ఆ సమయంలో పలు సినిమాలు చేస్తున్న కారణంగా నో చెప్పాను.

ఆ తర్వాత రెండవ పార్ట్‌ సమయంలో కూడా నా వద్దకు వచ్చారు.అప్పుడు కూడా నేను నో చెప్పాను.

ఆ రెండు సీజన్‌లు కూడా బిజీగా ఉండటం వల్ల నో చెప్పాను.ఇప్పుడు మూడవ సీజన్‌ కోసం నన్ను సంప్రదించలేదు.

తర్వాత ఏమైనా సంప్రదిస్తారోమే.అయితే మూడవ సీజన్‌కు కూడా నేను ఒప్పుకోలేను.

వరుసగా మూడు సినిమాలు కమిట్‌మెంట్‌ ఉండటం వల్ల నేను బిగ్‌బాస్‌కు ఓకే చెప్పలేక పోతున్నాను అన్నాడు

ప్రస్తుతం అల్లు అర్జున్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి.ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేస్తాడు, ఆ వెంటనే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఒక చిత్రంకు బన్నీ కమిట్‌ అయ్యాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube