ఎటూ తేల్చని బన్నీ.. ఎవరికి ఓటేస్తాడో?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Allu Arjun Not Decided For His Next Movie, Allu Arjun, Ala Vaikunthapuramulo, Pu-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీగా పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే బన్నీ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేసిన బన్నీ, స్టార్ డైరెక్టర్ కొరటాలతో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇక ఈ క్రమంలోనే మహి వి రాఘవ కూడా బన్నీతో ఓ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇలా మొత్తం మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన బన్నీ, ఏ సినిమాను ఓకే చేస్తాడా అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే బన్నీ మాత్రం ఈ మూడు సినిమాల్లో ఏది చేయాలా అనే డైలమాలో పడ్డాడు.కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్‌తో చేయాలా, ఐకాన్ సినిమాను పట్టాలెక్కించాలా లేక మహి వి రాఘవ చప్పే కథను ఓకే చేయాలా అనే సంధిగ్దంలో పడ్డాడు బన్నీ.

మొత్తానికి అల వైకుంఠపురములో సక్సెస్‌ను ఎంజాయ్ చేసిన బన్నీ, పుష్ప చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.మరి ఆ తరువాత బన్నీ ఓటు ఎవరికి అనే అంశమే ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube