బన్నీ ఇంతలో అంత మార్పు ఏంటీ?

ఇటీవలే జరిగిన రానా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్‌ వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌లో చాలా సింపుల్‌గా నీట్‌ హెయిర్‌ స్టైల్‌తో కనిపించిన విషయం తెల్సిందే.దాంతో జుట్టు కట్‌ చేశాడా ఏంటీ అనే అనుమానం కలిగింది.

 Allu Arjun New Stylish Look Goes Viral , Allu Arjun, Niharika Engagements, Mega-TeluguStop.com

ఆ స్టిల్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి.అల్లు అర్జున్‌ గురించి చాలా పుకార్లు షికార్లు చేశాయి.

ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ కొత్త లుక్‌ మళ్లీ నెట్టింట వైరల్‌ అవుతోంది.నిన్న నిహారిక వివాహ నిశ్చితార్థంలో బన్నీ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈసారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ కాస్ట్యూమ్స్‌లో విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు.ఆయన హెయిర్‌ మొన్నటికి నిన్నటికి ఎంతో తేడా అనిపిస్తుంది.పుష్ప చిత్రం కోసం బన్నీ హెయిర్‌ స్టైల్‌ మార్చినట్లుగా తాజా లుక్‌తో అర్థం అవుతుంది.రానా పెళ్లిలో చాలా సింపుల్‌గా కనిపించిన బన్నీ నిహారిక ఎంగేజ్‌మెంట్‌లో మాత్రం రచ్చ లుక్‌తో ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు.

అంత మంది మెగా హీరోల్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడో లేదా మరేంటో కాని బన్నీ స్టైలిష్‌ స్టార్‌ పేరుకు సార్థకం చేసుకున్నాడు.

Telugu Allu Arjun, Niharika, Pushpa, Rana Mihika, Sukumar-

నిశ్చితార్థం ఫొటోలతో పాటు అల్లు అర్జున్‌ మరియు బన్నీ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.అందుకు సంబంధించిన వీడియోలు కూడా తెగ సర్క్యులేట్‌ అవుతున్నాయి.అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రం షూటింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత ఆయన షూటింగ్‌కు జాయిన్‌ అవుతాడు.సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంను మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube