మరో ఆలోచన లేకుండా త్రివిక్రమ్‌కే ఫిక్స్‌  

Allu Arjun Next With Trivikram Srinivas-

అల్లు అర్జున్‌ వరుసగా నాలుగు విజయాల తర్వాత ‘నా పేరు సూర్య’ చిత్రంతో ఫ్లాప్‌ను చవిచూసిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ వంశీ వక్కంతం దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బన్నీకి తీవ్ర నిరాశను మిగిల్చింది.ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డ బన్నీ ఆ ఫ్లాప్‌ను అంత త్వరగా జీర్ణించుకోలేక పోతున్నాడు..

Allu Arjun Next With Trivikram Srinivas--Allu Arjun Next With Trivikram Srinivas-

తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ చేయాల్సిన సినిమా చాలా నెలల క్రితమే ఖరారు అయ్యింది.విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా చేసేందుకు బన్నీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రంలో నటించేందుకు అల్లు అర్జున్‌కు కాస్త టెన్షన్‌ అవుతుంది.నా పేరు సూర్య చిత్రం భిన్నంగా ఉంటుందని, కెరీర్‌లో నిలిచి పోతుందని భావిస్తే అది ఫ్లాప్‌ అయ్యి నిరాశ పర్చింది.అందుకే తదుపరి చిత్రం విషయంలో ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్‌ తదుపరి చిత్రంకు చాలా టైం తీసుకుంటున్నాడు.పు కథలు విన్న అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తోనే చేయాలని నిర్ణయించుకున్నాడు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలతో ఆకట్టుకున్న వీరిద్దరు మరో సినిమా చేయబోతున్నారు.దర్శకుడు త్రివిక్రమ్‌ చాలా నెలల క్రితమే ఈ చిత్రాన్ని అనుకున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న అరవింద సమేత చిత్రం పూర్తి అయిన తర్వాత రెండు నెలలకు బన్నీతో మూవీ మొదలు పెట్టబోతున్నాడు..

త్రివిక్రమ్‌తో మూవీ ప్రారంభంకు ముందే ఒక చిత్రాన్ని చేయాలని బన్నీ మొదట భావించాడు.కాని కథలు సెట్‌ అవ్వక పోవడంతో త్రివిక్రమ్‌ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు.అక్టోబర్‌లో అరవింద సమేత చిత్రం విడుదల కాబోతుంది.

ఆ తర్వాత అంటే డిసెంబర్‌లో అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ సినిమా మొదలు పెడదాం అంటూ చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

ఇప్పటికే స్టోరీ లైన్‌ కూడా సిద్దంగా ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్‌ ఎక్కువ ఆలస్యం చేయకుండా సినిమాను చేసే అవకాశం కనిపిస్తుంది.బన్నీకి దాదాపు ఆరు ఏడు నెలల గ్యాప్‌ వస్తుంది.ఇటీవలే కాస్త ఆలస్యం అయినా కూడా మంచి చిత్రంతో ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఆ హామీ మేరకు త్రివిక్రమ్‌ మూవీతో బన్నీ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.