త్రివిక్రమ్‌ థాట్‌ ను మార్చేసిన అల్లు అర్జున్‌!  

Allu Arjun Next Movie With Trivikram Srinivas-allu Arjun Nexy Movie,trivikram Next Movie,trivikram Srinivas

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన ‘జులాయి’ మరియు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మూడవ సినిమాకు రంగం సిద్దం అవుతుంది. అరవింద సమేత చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న త్రివిక్రమ్‌ ఒక స్టోరీని బన్నీ కోసం సిద్దం చేశాడు..

త్రివిక్రమ్‌ థాట్‌ ను మార్చేసిన అల్లు అర్జున్‌!-Allu Arjun Next Movie With Trivikram Srinivas

అరవింద సమేత చిత్రంకు ముందే ఆ కథను సిద్దం చేసుకున్న త్రివిక్రమ్‌ తాజాగా ఆ కథను బన్నీకి వినిపించాడట. అయితే ఆ కథలో బన్నీ మార్పులు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

త్రివిక్రమ్‌ ఒక స్టార్‌ డైరెక్టర్‌. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తిని కనబర్చుతారు.

అల్లు అర్జున్‌ కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కాని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్‌ కు ఉన్నది ఉన్నట్లుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు మాత్రం అంగీకారం చెప్పడం లేదు. ఇప్పటికే బన్నీ అండ్‌ టీం త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులకు ప్రయత్నాలు చేస్తున్నారట..

బన్నీతో పాటు అల్లు అరవింద్‌ కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాలో ఎంటర్‌ టైన్‌మెంట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారట.

అల్లు అర్జున్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా కథ మరియు స్క్రీన్‌ప్లేను రెడీ చేయాలని మెగా కాంపౌండ్‌ త్రివిక్రమ్‌కు సలహా ఇచ్చారట. తన థాట్స్‌ ప్రకారం త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని వచ్చాడు.

కాని ఇప్పుడు ఆ స్క్రిప్ట్‌ను మార్చాల్సిందిగా కోరుతున్నారు. ఇలా స్క్రిప్ట్‌ మార్చితే ఇబ్బందని త్రివిక్రమ్‌కు తెలుసు. అయినా కూడా వారి కోరిక మేరకు అలాగే చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా తొస్తోంది..

వచ్చే ఏడాది ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం కోసం కైరా అద్వానీ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.