అల్లు అర్జున్‌ కోసం మరో దర్శకుడితో చర్చలా? ఇంతకు నెక్ట్స్‌ ఏంటీ?

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సినిమా ను చేస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Allu Arjun Next Movie With Ar Murugadas-TeluguStop.com

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ తనదైన శైలిలో పుష్ప సినిమా ను రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో బన్నీ తదుపరి సినిమా పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మొదటి నుండి బన్నీ తదుపరి సినిమా కొరటాల దర్శకత్వంలో అనుకున్నారు.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

 Allu Arjun Next Movie With Ar Murugadas-అల్లు అర్జున్‌ కోసం మరో దర్శకుడితో చర్చలా ఇంతకు నెక్ట్స్‌ ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పక్కకు పోయింది.ఎన్టీఆర్‌ తో కొరటాల శివ సినిమా ను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.

అందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి.దాంతో బన్నీ తదుపరి సినిమ ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో సినిమా క్యాన్సిల్‌ అయిన వెంటనే ఎక్కువ శాతం మంది వేణు శ్రీరామ్‌ దర్శకత్వం లో ఐకాన్‌ సినిమాను బన్నీ మొదలు పెట్టే అవకాశం ఉందని అనుకున్నారు.కాని ఆ తర్వాత పలువురి దర్శకుల పేర్లు ప్రస్థావనకు వచ్చాయి.

అందులో ప్రధానంగా ప్రశాంత్ నీల్‌ పేరు కూడా ఉంది.సలార్‌ ముగించిన వెంటనే అల్లు అర్జున్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత మురుగదాస్ తో అల్లు అరవింద్‌ చర్చలు జరుపుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.మొత్తంగా ఈ సినిమా పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదే సమయంలో యంగ్‌ డైరెక్టర్‌ తో కూడా బన్నీ సినిమా చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.మొత్తంగా బన్నీ తదుపరి సినిమా ఏంటీ అనే విషయంలో గందరగోళ విషయం నెలకొని ఉంది.

మురుగదాస్‌ తో అయినా సినిమా కన్ఫర్మ్‌ అయ్యేనా అనేది చూడాలి.

#Koratala Siva #AR Murugadas #Murugadas #Allu Aravind #Venu Sri Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు