అరుదైన ఆ రికార్డు కోసం బన్నీ దసరాకే రావాలనుకుంటున్నాడు  

Allu Arjun Next Movie To Release On Dasara-allu Arjun,dasara,dasara Release,lorry Driver Role,sukumar

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రం ఇప్పటికే మొదలైన విషయం తెల్సిందే.మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Allu Arjun Next Movie To Release On Dasara-Allu Dasara Lorry Driver Role Sukumar

అల వైకుంఠపురంలో చిత్రం కారణంగా బన్నీ ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యం చేస్తున్నాడు.ఇన్ని రోజులు ఆ సినిమా సక్సెస్‌ వేడుకలు చేసుకున్న బన్నీ మరికొన్ని రోజుల్లో సుకుమార్‌ మూవీలో నటించబోతున్నాడు.

విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే.

సుకుమార్‌పై నమ్మకంతో ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌ పాత్రను చేసేందుకు సిద్దం అయ్యాడు.

రంగస్థలం చిత్రం తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను సుకుమార్‌ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ చిత్రం కూడా ఖచ్చితంగా హిట్‌ అయితే బన్నీకి బ్యాక్‌ టు బ్యాక్‌ భారీ విజయాలు ఖాతాలో పడ్డట్లు అవుతుంది.

ఇక అల్లు అర్జున్‌ ఇదే సమయంలో ఒక అరుదైన రికార్డు కోసం తహతహలాడుతున్నాడు.

ఏ హీరో కూడా ఈమద్య కాలంలో ఒకే సంవత్సరంలో రెండు బ్లాక్‌ బస్టర్స్‌ అందుకోలేదు.అలాగే ఒకే ఏడాది 300 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకోలేదు.

ఇప్పుడు ఆ రికార్డును బన్నీ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

అ వైకుంఠపురంలో చిత్రంతో దాదాపుగా 200 కోట్ల వసూళ్లను దక్కించుకున్న బన్నీ తన తదుపరి చిత్రం కూడా సక్సెస్‌ అయితే అది కూడా ఇదే ఏడాది సక్సెస్‌ అయితే మరో 150 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.అంటే 350 కోట్లు అది కూడా ఒకే ఏడాదిలో అంటూ బన్నీ రికార్డుగా చెప్పుకోవచ్చు అని, ఇలాంటి అరుదైన రికార్డును ఎవరు అంత సులువుగా బ్రేక్‌ చేయలేరు అంటూ బన్నీ ఆశపడుతున్నాడు.

అందుకే దసరా లేదా దీపావళి వరకు సుకుమార్‌ మూవీని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

.

తాజా వార్తలు

Allu Arjun Next Movie To Release On Dasara-allu Arjun,dasara,dasara Release,lorry Driver Role,sukumar Related....