ఈ ఏడాదిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుని బన్నీకి అదిరిపోయే స్టార్ట్‌ను అందించింది.ఇక ఇదే ఊపులో తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు బన్నీ.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్‌లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాను తొలుత వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చూశారు.
కానీ 2021 జనవరి 8న ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులను తిరగరాయడానికి రెడీగా ఉందని రాజమౌళి తెలపడంతో, బన్నీ తన సినిమాను 2021 ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
గతంలో ఇదే తేదీన బాహుబలి 2 చిత్రం రిలీజ్ అయ్యి ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు బన్నీ-సుక్కు కూడా అదే స్ట్రాటెజీని ఫాలో అయ్యి తమ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.