మరీ ఇంత ఆలస్యం ఎందుకు గురూజీ ఈ ఏడాది బన్నీ ఫ్యాన్స్‌కు నిరాశే  

Allu Arjun New Movies Not In 2019-

అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రం ముందుగా అనుకున్నదాని కంటే మూడు నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది.

Allu Arjun New Movies Not In 2019--Allu Arjun New Movies Not In 2019-

దాంతో సినిమా విడుదల కూడా కాస్త ఆలస్యం అవుతుందని అంతా భావించారు.ఎంత ఆలస్యం అయినా కూడా ఈ ఏడాదిలోనే సినిమా వచ్చేలా బన్నీ ప్రయత్నాలు చేస్తాడని అంతా భావించారు.కాని అనూహ్యంగా సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాదికి ఫిక్స్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

Allu Arjun New Movies Not In 2019--Allu Arjun New Movies Not In 2019-

దసరాకు కాకున్నా క్రిస్మస్‌కు అయినా బన్నీ మూవీ వస్తుందేమో అని అంతా భావించారు.కాని బన్నీ మూవీ షూటింగ్‌ ఆలస్యం అయిన కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఎక్కువగా ఉంటుంది కనుక ఇప్పటి నుండే డేట్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.

అందుకే జనవరి 11 లేదా 13వ తారీకున ఈ చిత్రంను విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతుంది.

బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య’ చిత్రం పోయిన ఏడాది వచ్చింది.2018 ఆరంభంలో ఆ చిత్రం వచ్చింది.ఆ సంవత్సరం మొత్తం బన్నీ ఖాళీనే.ఇక ఈ ఏడాదిలో కూడా బన్నీ మూవీ రావడం లేదు.అంటే 2019లో బన్నీ నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాబోవడం లేదు.బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడు ఒక ఇయర్‌ను ఖాళీగా ఉంచలేదు.మొదటి సారి బన్నీ మూవీ లేకుండా ఒక సంవత్సరం గడవబోతుందని మెగా ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.