సన్నాఫ్ సత్యమూర్తి లుక్స్ లోకి వచ్చేసిన అల్లు అర్జున్  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఫోటోలు. .

Allu Arjun New Movie Looks Viral In Social Media-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ తాజాగా మొదలైంది.

Allu Arjun New Movie Looks Viral In Social Media--Allu Arjun New Movie Looks Viral In Social Media-

త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు చేసిన బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే టార్గెట్ తో ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.ఇక ఈ సినిమా కూడా సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రి, కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్, అలాగే నవదీప్ కీలక పాత్రలు చేస్తూ ఉండగా, సీనియర్ హీరోయిన్ టబు ఇందులో అల్లు అర్జున్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

తాజాగ బన్నీ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి.ఇక ఈ ఫోటోలలో బన్నీ చాలా స్మార్ట్ గా, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరహాలోనే ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలో క్యారెక్టర్ కోసం తన లుక్ ని మార్చుకుంటూ సరికొత్తగా కనిపించే ప్రయత్న అల్లు అర్జున్ చేస్తూ ఉంటాడు.ఈ నేపధ్యం తాజాగా త్రివిక్రమ్ సినిమా కోసం ఏకంగా సాఫ్ట్ వేర్ కుర్రాడిగా అల్లు అర్జున్ మారిపోయినట్లు సమాచారం.