బాగా పెంచేసిన బన్నీ.. రెమ్యునరేషన్ కాదండోయ్!  

Allu Arjun New Look For Sukumar Movie - Telugu Aa20, Allu Arjun, Sukumar, Telugu Movie News, Tollywood Gossips

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బన్నీ.

Allu Arjun New Look For Sukumar Movie - Telugu Aa20 News Tollywood Gossips

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కి్స్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది.దీని కోసం బన్నీ గుబురైన గడ్డం పెంచుతున్నాడు.

ఈ సరికొత్త లుక్‌లో బన్నీ దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బన్నీని ఇలా చూసి జనాలు అవాక్కయ్యారు.

ఈ సినిమా కోసం కాస్త బాడీ కూడా పెంచాడు బన్నీ.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడు.

బన్నీ సరసన అందాల బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు

Allu Arjun New Look For Sukumar Movie-allu Arjun,sukumar,telugu Movie News,tollywood Gossips Related....