టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా పుష్ప 1 కి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్( Fahad Fazil ) విలన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్ కార్ట్‌కు బ్రాండ్( Flipkart ) అంబాసిడర్‌గా మారినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఆ యాడ్ కి సంబంధించిన షూట్ కూడా ఇటీవలే ముగిసిందని తెలుస్తోంది.

అయితే ఒక్కో యాడ్‌కు అల్లు అర్జున్ 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఇక అల్లు అర్జున్ గతంలో రెడ్‌బస్, కోకా-కోలా, ఆస్ట్రల్, కెఎఫ్‌సి, జొమాటో వంటి పెద్ద పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు అల్లు అర్జున్ కథలో మరొక బ్రాండ్ కూడా చేరింది.మొత్తానికి అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వరలవ్వడంతో అమ్మ బాబోయ్ ఒక్క యాడ్ ఏకంగా అన్ని కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.