స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.
వీరిలో మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఇండస్ట్రీలోని చాలా మంది బన్నీకి బెస్ట్ విషెస్ తెలిపారు.అయితే బన్నీకి పలు కంపెనీలు కూడా తమ శుభాకాంక్షలు తెలిపాయి.
ఈ క్రమంలో డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కూడా బన్నీకి తమ విషెస్ తెలపాలని పప్పులో కాలేశాయి.బన్నీ నటించిన అల వైకుంఠపురములోని బుట్ట బొమ్మా అనే పదాలతో శుభాకాంక్షలు తెలిపింది.
‘హ్యాపీ బర్త్‌డే టు బుట్ట బొమ్మా!’ అని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.దీంతో బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్లో వాళ్లను ఏసుకున్నారు.
తెలుగులో ఆ పదానికి అర్ధం తెలుసుకుని శుభాకాంక్షలు తెలపాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తప్పిదం నుండి తేరుకున్న నెట్‌ఫ్లిక్స్ వెంటనే తమ ట్వీట్‌ను డిలీట్ చేసింది.
మొత్తానికి బన్నీ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలపాలని ప్రయత్నించిన నెట్‌ఫ్లిక్స్ ఇలా అభాసుపాలైంది.