నా పేరు సూర్య ఆడటం కష్టమే.. ఎందుకంటే!  

అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ చిత్రంపై మొన్నటి వరకు అందరిలో అంచనాలు భారీగా ఉండేవి..

నా పేరు సూర్య ఆడటం కష్టమే.. ఎందుకంటే!-

కాని తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాపై ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వచ్చిన రెండు మూడు సినిమాలను మిక్సీలో వేసి రుబ్బి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగానే ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుందంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఇటీవల వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు.

కాని ఈ చిత్రం ఆయనకు సక్సెస్‌ను ఇవ్వడం కష్టమే అంటున్నారు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కాస్త ఎక్కువగానే దట్టించినట్లుగా అనిపిస్తుందని ట్రైలర్‌లో కనిపిస్తుంది. అను ఎమాన్యూల్‌, బన్నీల మద్య లవ్‌ ట్రాక్‌ సినిమా మెయిన్‌ స్ట్రీమ్‌ను దెబ్బ తీసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

ఆర్మీ నేపథ్యంలో సినిమా అంటే ఖచ్చితంగా సీరియస్‌ మూడ్‌లో సాగాల్సి ఉంటుంది. కాని కాని ఈ చిత్రంలో బన్నీ, అను ఎమాన్యూల్‌ల లవ్‌ ట్రాక్‌ ఎక్కువ ఉండి, రొమాంటిక్‌ సీన్స్‌, సాంగ్స్‌తో సినిమా అసలు కథ పక్కకు వెళ్తుందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నా పేరు సూర్య చిత్రంపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఆలోచనాత్మకంగానే ఉన్నాయి.

అందుకే ఈ సినిమా ఫలితంపై అప్పుడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎంతో మంది రచయితలు దర్శకులుగా సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. కొందరు మాత్రం ఆకట్టుకోలేక పోయారు. మరి సూపర్‌ హిట్‌ దర్శకుల జాబితాలో ఈ రచయిత చేరుతాడా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

నా పేరు సూర్యపై వచ్చిన హైప్‌ కారణంగా అన్ని ఏరియాల్లో కూడా భారీ ఎత్తున బిజినెస్‌ అయ్యింది. ఇప్పటికే నిర్మాతలు సేఫ్‌ అయ్యారని, డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం డేంజర్‌లో ఉంటారని ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మే 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అర్జున్‌, శరత్‌ కుమార్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.