మురుగదాస్ బన్నీ కాంబినేషన్ లో గజినీ సీక్వెల్ !

ప్రస్తుతం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

 Allu Arjun Movie With Murugadoss-TeluguStop.com

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

రష్మిక ఇందులో ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

 Allu Arjun Movie With Murugadoss-మురుగదాస్ బన్నీ కాంబినేషన్ లో గజినీ సీక్వెల్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చాలా మేరకు పూర్తి అయ్యింది.

అయితే అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.కానీ ఇప్పటికే చాలా డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.తాజాగా అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుందని సమాచారం.

అంతేకాదు ఎలాంటి కథతో రాబోతున్నాడో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మురుగదాస్ బన్నీ కాంబినేషన్ లో గజినీ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు ముందే అల్లు అరవింద్ గజనీ 2 టైటిల్ ను రిజిస్టర్ చేయించారని వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం మురుగదాస్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.

#Ghajini Sequel #Allu Aravind #Murugadoss #AlluArjun #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు