మొన్న మెగా హీరో వరుణ్ తేజ్ చిత్రం అయిన వాల్మీకి చిత్రం విడుదల సరిగ్గా ఆరు గంటల ముందు గద్దలకొండ గణేష్ అని పేరు మార్పు తో విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వైకుంఠపురంలో చిత్రం టైటిల్ లో కూడా మార్పు చేసినట్లు తెలుస్తుంది.
అయితే మరీ వాల్మీకి చిత్రం టైటిల్ మార్పు చేసినంత పెద్ద మార్పు కాదు కానీ ఎదో లెటర్స్ లో చిన్న మార్పు చేసినట్లు తెలుస్తుంది.వైకుంఠపురం అనే పేరులో ఆర్ అక్షరం ఉంది.
ఒక అక్షరం కాకుండా ఆర్ ఆర్ అనే రెండు అక్షరాలుగా మార్చారు.అంటే.
ఆర్ కు మరో అక్షరం యాడ్ చేశారు.అయితే ఇదంతా ఎందుకు అంటే జ్యోతిష్యం.
ఈ జ్యోతిష్యం పిచ్చి ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా ఇండస్ట్రీ లో కూడా పాటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముహూర్తం నుంచి ప్రతి ఒక్కటి జ్యోతిషులు సూచించిన ప్రకారం గా నడుచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే మరొక అక్షరం యాడ్ చేయాలని జ్యోతిష్యులు సూచించడంతో అక్షరాన్ని యాడ్ చేశారట.
అయితే బన్నీ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి పెద్ద ప్లాప్ తరువాత ఇంత గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు అక్షరం మార్పు కూడా చేసి మరి విడుదల కు సిద్ధం చేస్తున్నారు.అయితే ఈ అక్షరంతో బన్నీ ఫేట్ మారుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.