'పుష్ప' రెండు పార్ట్‌ లకు సుకుమార్‌ పారితోషికం ఎంతో తెలుసా?

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్‌ చేయాల్సిన సినిమా మహేష్ బాబుతో.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

 Hero Allu Arjun Movie Pushpa Budget And Sukumar Remuneration , Allu Arjun, Pushp-TeluguStop.com

మహేష్ బాబు కోసం దాదాపుగా ఏడాది పాటు వెయిట్‌ చేసిన సుకుమార్‌ ఆ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో వెంటనే అల్లు అర్జున్ తో సినిమా ను మొదలు పెట్టాడు.పుష్ప సినిమా ప్రకటించిన ఏడాది కాలం కు కాని ఆరంభం కాలేదు.

ఆరంభం అయిన వెంటనే కరోనా కారణంగా మరో ఏడాది పాటు వాయిదా పడింది.ఇక పుష్ప ను రెండు పార్ట్‌ లు గా తీసుకు రాబోతున్నారు.

అంటే మరో రెండేళ్ల పాటు ఈ సినిమా ను చేయాల్సి ఉంటుంది.అంటే మొత్తంగా ఈ సినిమా కోసం సుకుమార్‌ ఏకంగా నాలుగు సంవత్సరాలు కేటాయించాడు.

ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన సినిమా లు రెండు మూడు అయినా చేసి ఉండేవాడు.కాని పుష్ప కోసం టైమ్‌ కేటాయించడం వల్ల ఆయన ఇతర సినిమా లు చేయలేక పోయాడు.

అందుకే పుష్ప సినిమా కోసం భారీ పారితోషికంను అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప రెండు పార్ట్‌ లకు గాను దర్శకుడు సుకుమార్ ఏకంగా 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట.

ఇది మాత్రమే కాకుండా సినిమా సక్సెస్ అయితే లాభాల్లో వాటాను కూడా పొందే అవకాశం ఉంది.సినిమా ఏమాత్రం సక్సెస్ అయినా కూడా కనీసం 5 నుండి 10 కోట్ల వరకు అదనంగా పారితోషికంగా దక్కించుకునే అవకాశం ఉంది.

సుకుమార్‌ కే ఇంత ఉంటే బన్నీకి ఇంకెంత పారితోషికం ఉంటుందో ఊహించుకోవచ్చు.ఈ సినిమా ను 250 నుండి 275 కోట్ల బడ్జెట్‌ తో మేకర్స్ రూపొందిస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube